కరాచీ : పొట్టి ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌పై వేటు పడింది. ఈ నెల 11 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా ఎంపికచేసిన 15 మంది జట్టు సభ్యులలో అతడికి చోటు దక్కలేదు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలతో ఈ సిరీస్‌పై అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. పీసీబీ తాజాగా జట్టును ప్రకటించడం గమనార్హం.
సూపర్-8 దశలోనే నిష్క్రమించి ఇంటా బయటా తీవ్ర విమర్శలెదుర్కుంటున్న ఆ జట్టులో పీసీబీ భారీ ప్రక్షాళన చేసింది. ఏకంగా ఆరుగురు అన్క్యాప్డ్ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించింది. షహీన్ షా అఫ్రిది సారథ్యం వహించనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో చోటు కోల్పోయిన పేసర్ హరీస్ రౌఫ్‌తో పాటు బ్యాటర్ హుస్సేన్ తలాత్ వచ్చే జట్టులోకి వచ్చారు. ఈనెల 11, 13, 15 తేదీల్లో ఢాకా వేదికగా మూడు వన్డేలు జరుగుతాయి.