కేశంపేట, జూన్ 22 : ప్రజాపాలనలో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు పెట్టుకున్న అభ్యర్థులను లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం కేశంపేట తహసీల్దార్ ఆజం అలీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ ఆవరణలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, డీలర్లతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలను అందజేసి మాట్లాడారు.
మండలానికి 2600కొత్త రేషన్‌కార్డులు మంజూరయ్యాయని, అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు గతంలో తమ కుటుంబ సభ్యులకు ఉన్న రేషన్‌కార్డులో నమోదై ఉన్నారన్నారు. కొత్త కార్డు కావాలంటే పాత రేషన్‌కార్డులో పేరును తొలగించాల్సి వస్తుందని, ఈ విషయమై లబ్ధిదారుల అభిప్రాయంతోపాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు నెంబర్‌ను యాప్‌లో పొందు పరచాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కిష్టయ్య, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.