సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టాండర్ట్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (జీటీ సేఫ్) కమిషనర్‌గా అవినాశ్ మహంతి సోమవారం వెంగళరావునగర్‌లోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో టీజీ సేఫ్ తొలి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆహార, ఔషధాల నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగు పర్చడానికి ప్రభుత్వం ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను విలీనం చేసి, కొత్తగా టీజీ సేఫ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అయితే మొన్నటి వరకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా ఉన్న మహంతి ఇక నుంచి టీజీ సేఫ్ కమిషనర్‌గా వ్యవహరించనున్నారు.