Viral Video : బ్లూ కలర్లో ఉండే ఆహార పదార్ధాలు వినూత్న షేడ్స్‌తో కంటికి ఇంపుగా కనిపిస్తూ ఆకట్టుకుంటాయి. ఇక బ్లూ కలర్ ఘీ రైస్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. దికుకింగ్మామ అనే అకౌంట్ ఇన్స్టాగ్రాం రీల్లో వ్లాగర్ బటర్‌ఫ్లై పీ ఫ్లవర్స్‌ను శుభ్రం చేసి వాటి రెక్కలను వేరు చేయడం కనిపిస్తుంది. వాటిని నీటిలో పోసి మరిగించి ఆకులను తీసివేసి బ్లూ లిక్విడ్‌లో రైస్‌ను కుక్ చేస్తుంది. ఆపై దానిపై నెయ్యితో పాటు సాల్ట్‌ను జోడిస్తుంది.
మరో కుండలో నేయిని వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్‌ను వేసి స్పైసెస్ను సిద్ధం చేస్తుంది. ఈ మసాలాలో బ్లూ రైస్‌ను ఆమె మిక్స్ చేస్తుంది. పదార్ధాలన్నింటినీ కలగలుపుతూ బటర్‌ఫ్లై పీ ఘీ రైస్‌ను సిద్ధం చేస్తుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 1.2 కోట్ల వ్యూస్ లభించాయి. ఇక ఇన్స్గాగ్రాం యూజర్ల నుంచి ఈ వీడియోకు మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఈ ఐడియాను మెచ్చుకోగా మరికొందరు ఇదేం టేస్ట్ అంటూ పెదవివిరిచారు.
ఓ యూజర్ దీన్ని అవతార్ బిర్యానీ అని కామెంట్ చేయగా ఎంఐ రైస్ ప్లేట్ అని (ముంబై ఇండియన్స్) రాసుకొచ్చారు. మలేషియాలో తాము ఈ ఫ్లవర్‌తో బ్లూ రైస్ చేసుకుంటామని దీన్ని నాసి కెరబు అని పిలుస్తారని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఇక ఇదే నా చివరి బిర్యానీ అని ఫీలవుతున్నానని మరో యూజర్ పెదవివిరిచారు. గాడ్..నేను ఎన్నడూ ఈ ఫుడ్ ఐటెం జోలికి వెళ్లనని మరో యూజర్ కామెంట్ చేశారు. బ్లూ కలర్ రైస్ చూడగానే నా ఆకలి ఎగిరిపోయిందని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Arvind Kejriwal | కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ