Arvind Kejriwal | కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. టీలో ఎక్కువ పంచదార వంటి చర్యల ద్వారా షుగర్ లెవల్స్ పెంచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించింది.
న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. టీలో ఎక్కువ పంచదార వంటి చర్యల ద్వారా షుగర్ లెవల్స్ పెంచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. తన బ్లడ్ షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన షుగర్ లెవల్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వైద్యుడ్ని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, ఈడీ తరుఫు న్యాయవాది జోహెబ్ హొస్సేన్ కోర్టులో వాదనలు వినిపించారు. షుగర్ లెవల్స్ పెంచుకునేందుకు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ఆరోపించారు. షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గుల సాకుతో బెయిల్ కోరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని కోర్టుకు తెలిపారు.
మరోవైపు ఈడీ న్యాయవాది జోహెబ్ వ్యాఖ్యలపై అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది వివేక్ జైన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియాను ఆకట్టుకునేందుకు ఈడీ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని సరైన పిటిషన్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో కేజ్రీవాల్ డైట్‌కు సంబంధించి మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

