Amrita Pandey | చిత్ర పరిశ్రమలో విషాదం.. ఉరి వేసుకొని నటి ఆత్మహత్య..!
Amrita Pandey | భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. భోజ్‌పురి నటి అన్నపూర్ణ అలియాస్ అమృతా పాండే ఆత్మహత్యకు పాల్పడింది. బిహార్‌లోని జోగ్‌సర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తన అపార్ట్మెంట్లో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Amrita Pandey | భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. భోజ్‌పురి నటి అన్నపూర్ణ అలియాస్ అమృతా పాండే ఆత్మహత్యకు పాల్పడింది. బిహార్‌లోని జోగ్‌సర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తన అపార్ట్మెంట్లో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, ఆత్మహత్యకు ముందు రాసిన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టింది. ప్రస్తుతం ఈ స్టేటస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భోజ్‌పూర్ చిత్రాలతో పాటు పలు హిందీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీషోల్లో పని చేసింది. అలాగే, పలు ప్రకటనల్లోనూ మెరిసింది. కొద్దిరోజులుగా కెరీర్‌పై ఆందోళనతో డిప్రెషన్లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతుందని కుటుంబీకులు తెలిపారు. అవకాశాలు రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబీకులు పేర్కొన్నారు.
2022లో ముంబయిలో నివసించే ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌కు చెందిన చంద్రమణి ఝంగద్తో వివాహమైంది. ఆయన యానిమేషన్ ఇంజినీర్. అమృతా డిప్రెషన్లో ఉండగానే.. వెబ్‌సిరీస్ ‘ప్రతిశోద్’లో నటించగా.. విడుదలైంది. ఆత్మహత్యపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లాడగా.. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో అమృతపాండే సోదరి తన గదిలోకి వెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత అమృతా ఉరివేసుకొని కనిపించిందని ఆమె సోదరి తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

