ఖలీల్వాడి /కంఠేశ్వర్, ఫిబ్రవరి 22: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటోషో ఆదివారం ముగిసింది. అన్ని కంపెనీల వాహనాలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి ప్రదర్శించారు. వాహనాల ప్రదర్శనకు భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. కొందరు టెస్ట్ డ్రైవ్ చేయ గా.. మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కార్లు, బైక్లు కొనుగోలు చేశా రు. స్పాట్ క్యాష్ చెల్లించి వాహనాలను సొంతం చేసుకున్నారు.
కియా సన్రైజ్, ప్రకాశ్ హ్యుం డాయ్, టాటామోటర్స్ ( శ్రీ వెంకటేశ్వర మోటర్స్), నెక్సా (మారుతి సుజుకి), హర్ష టయోటా, గ్రీన్ హోండా, నిస్సాన్ (లక్ష్మి నిస్సాన్), వరుణ్మోటర్ ( మారుతీ సుజుకి) ఆటోమోటివ్ మహేంద్ర, వెంకటేశ్వర హీరో, లక్ష్మి టీవీఎస్, దేవి ఆటోమొబైల్స్ రాయల్ ఎన్ఫీల్డ్, విజయగణపతి చేతక్, హోండా (శ్రీరామ్ హోండా) కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో మెయిన్ స్పాన్సర్ కియా జనరల్ మేనేజర్ సతీశ్, బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, ఏడీవీటీ మేనేజర్ కడార్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.