జన్నారం : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పోనకల్ గ్రామ సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఒకరు మృతి చెందినట్లు ఎస్సై జి రాజవర్ధన్ ( SI Rajavardan ) తెలిపారు . మందపల్లి గ్రామం నుంచి కొనకల గ్రామానికి సైకిల్ పై ఇంటికి వెళుతున్న గోలి రాజన్న (55) ను ఎదురుగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. దీంతో సైకిల్‌పై ఉన్న రాజన్న కిందపడి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని వివరించారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.