Accident | పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదురుగా రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఓ ఆటోను స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడటంతో తీవ్ర గాయాలైన ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిని రామగుండం ముబారక్‌నగర్ వాసిగా గుర్తించారు.