Australian PM | ఆస్ట్రేలియా (Australia) లోని సిడ్నీ నగరం (Sydney city)లో యూదులపై ఉగ్ర (Terrorists) దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ భయానక దాడి సమయంలో అహ్మద్ అల్ అహ్మద్ (Ahmed Al Ahmed) అనే వ్యక్తి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదులకు ఎదురెళ్లి గాయపడిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అహ్మద్‌ను ఆస్ట్రేలియా ప్రధాని (Australian PM) ఆంథోనీ అల్బనెస్ (Anthony Albanese) పరామర్శించారు. అహ్మద్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని ప్రధాని అల్బనెస్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ‘అహ్మద్.. నువ్వు హీరోవి. ఉగ్రవాదుల నుంచి అమాయక ప్రజలను కాపాడేందుకు నీ ప్రాణాలను పణంగా పెట్టావు. ప్రతి ఆస్ట్రేలియన్ తరఫున నీకు ధన్యవాదాలు’ అని వీడియోకి క్యాప్షన్ జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ నెల 14న బోండి బీచ్‌లో ఉగ్రదాడి సమయంలో అహ్మద్ తన స్నేహితుడితో కలిసి కాఫీ షాప్‌లో కాఫీ తాగుతున్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించగానే భయంతో బయటికి పరుగులు తీశారు. అక్కడ మారణహోమం జరుగుతుండటాన్ని చూసి అహ్మద్ చలించారు. ఇంట్లో విషయం చెప్పమని స్నేహితుడికి చెబుతూ ఉగ్రవాదిపై దాడి చేశాడు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తెగింపు ప్రదర్శించాడు. ఈ క్రమంలో అతడికి గాయాలయ్యాయి.
Ahmed, you are an Australian hero.
You put yourself at risk to save others, running towards danger on Bondi Beach and disarming a terrorist.
In the worst of times, we see the best of Australians. And that’s exactly what we saw on Sunday night.
On behalf of every Australian, I… pic.twitter.com/mAoObU3TZD
— Anthony Albanese (@AlboMP) December 16, 2025
Also Read..
ఆస్ట్రేలియా బీచ్‌లో ఉగ్ర ఘాతుకం
Bondi Beach Shooting | బోండీ బీచ్ ఉగ్రదాడి.. కాల్పులకు తెగబడింది తండ్రీకొడుకులే..