సిడ్నీ: ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తున్నది. భారత్‌పైనే కాదు ప్రపంచ దేశాలపైకి కూడా ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్నది. తాజాగా ఆస్ట్రేలియా (Australia) సిడ్నీలోని బోండీబీచ్‌లో (Bondi Beach Shooting) యూదుల హనుక్కా ఉత్సవంపై దాడికి పాల్పడింది పాకిస్థాన్‌కు (Pakishtan) చెందిన తండ్రీ కొడుకులుగా గుర్తించారు. క్రిస్మస్ సందర్భంగా రద్దీగా ఉండే సిడ్నీలోని బోండీ బీచ్ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా 15 మంది మరణించగా, ఇద్దరు పోలీసులతోపాటు సుమారు 40 మంది గాయపడ్డారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.
కాగా, ఆ ఇద్దరు సాయుధులను తండ్రీకొడుకులుగా దర్యాప్తు బృందం గుర్తించింది. వీరిని 50 ఏండ్ల సాజిద్ అక్రమ్ (Sajid Akram), 24 ఏండ్ల నవీద్ అక్రమ్ (Naveed Akram) అని తెలిపారు. అయితే పోలీసులు జరిపిన ఎదురుదాడిలో సాజిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. నవీద్ ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. వారికి పాకిస్థాన్ మూలాలున్నాయని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. సాజిద్ పేరిట 2015 నుంచి తుపాకీ లైసెన్స్ ఉన్నట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. అతడు ఓ హంటింగ్ క్లబ్లో కూడా సభ్యుడని చెప్పారు. దాడి సమయంలో ఘటనా స్థలం నుంచి కరడుగట్టిన ఉగ్రసంస్థ ఐసిస్ జెండా కనుగొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. దాడి వెనుక ఉద్దేశం ఏంటో తేలాల్సి ఉందని అంటున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రార్థనా మందిరాలు, యూదు సమాజానికి చెందిన ప్రదేశాల్లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
This is one of the #terrorist who killed so many innocent people in #bondibeach #Australia he is named as Naveed Akram of #pakistani origin, confirmed by australian media.
Pay close look the terrorist in the driving licence picture wears a pakistani cricket shirt. #Dhurandhar pic.twitter.com/A0ISdL5S7P— Wahdat Jalal (@WahdatJ) December 14, 2025
హమాస్ దాడిలో తప్పించుకొని..సిడ్నీలో గాయపడి
ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడి నుంచి తప్పించుకున్న వ్యక్తి సిడ్నీ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఇది రక్తపాతమని, ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితిలో, ప్రాణాల కోసం పరుగులు తీశామని ఆయన తెలిపారు. యాంటీ సెమిటిజంతో యూదులతో కలిసి పోరాడటం కోసం తాను రెండు వారాల క్రితమే ఆస్ట్రేలియాకు వచ్చానని చెప్పారు.
Video shows Islamist terrorist shooting over Jewish people, at Sydney’s Bondi Beach, Australia. pic.twitter.com/xOhZRP8E48
— Sujal Singh (@sujalsingh_x) December 15, 2025
🚨 Here’s a full 10 minute video of the terrorist attack that happened today in Bondi beach Australia.
How utterly terrifying pic.twitter.com/KNr8Xo6lRU
— Queen Natalie (@TheNorfolkLion) December 14, 2025