Tunnel Trailer | గద్దల కొండ గణేశ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కోలీవుడ్ యాక్టర్ అథర్వ మురళి (Atharvaa murali). తెలుగులో సినిమాలో మెరిసిన ఈ టాలెంటెడ్ యాక్టర్ టెన్నెల్ సినిమా కోసం ఖాకీ చొక్కా వేసుకున్నాడు. ఈ సారి యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రవీంద్ర మాధవ దర్శకత్వంలో అథర్వ మురళి నటించిన తమిళ చిత్రం (Thanal ). తెలుగులో టన్నెల్ పేరుతో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ మూవీని తెలుగులో సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. పోలీసుల బృందం సైరన్ల మోతతో టన్నెల్లోకి ప్రవేశించగా.. ఓ వ్యక్తి వారికి ఎదురుగా వస్తాడు. ఎవడ్రా నువ్వు అని పోలీసులు అడిగితే ఆ వ్యక్తి పిస్తోల్‌తో ఫైరింగ్ చేసే సన్నివేశాలతో షురూ అయింది ట్రైలర్. అనుమానాస్పద హత్యలు, వాటిని అధర్వ మురళి అండ్ పోలీసుల టీం ఎలా చేధించారనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చాడు డైరెక్టర్. ఈ యూనిఫాం వేసుకున్న ప్రతీ ఒక్కడికి అందరు ఫ్యామిలీనే రా అంటూ అథర్వ మురళి చెప్తున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
క్రూరమైన హత్యల వెనుకున్న సైకోను పట్టుకునే పోలీసాఫీసర్‌గా అథర్వ మురళి కనిపించనున్నట్టు ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. ఇంతకీ అతడు ఆ సైకోను పట్టుకున్నాడా..? లేదా..? అనే సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రంలో అశ్విన్ కాకుమాను విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా ఏ రాజు నాయక్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కొణిదెల హీరోయిన్గా నటిస్తోంది.
టన్నెల్ ట్రైలర్..
Shilpa Shetty | కొత్తగా మీ ముందుకొస్తున్నాం.. రెస్టారెంట్ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి
Ghaati | ఘాటి అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టిక్కెట్స్