Lokah Chapter 1: Chandra | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ‘లోకా: చాప్టర్ 1 – చంద్ర'(Lokah Chapter 1: Chandra) చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన వారం రోజులకే రూ.101 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మలయాళం జానపదం నుంచి తీసుకున్న కథ ఆధారంగా దానికి సూపర్ వుమెన్ కథను జోడించి హిట్‌ను అందుకున్నాడు దర్శకుడు డామినిక్ అరుణ్. కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో సూపర్‌హీరోగా నటించగా.. ప్రేమలు నటుడు నస్లెన్ కె. గఫూర్ కథానాయకుడిగా నటించాడు.
ఈ సినిమా కేవలం మలయాళంలోనే కాకుండా, తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ మంచి వసూళ్లను రాబడుతుంది. మలయాళ పరిశ్రమలో ఇంత తక్కువ సమయంలో రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాల్లో ఇది ఒకటి కాగా.. మహానటి, రుద్రమదేవి వంటి చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సౌత్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. మరోవైపు లోక యూనివర్స్‌లో భాగంగా ఇందులో మొత్తం ఐదు పార్టులు ఉంటాయని దర్శకుడు ప్రకటించాడు.
Thank you all for this endless ocean of love !#Lokah #TheyLiveAmongUs@DQsWayfarerFilm @dulQuer @dominicarun@NimishRavi@kalyanipriyan@naslen__ @JxBe @chamanchakko @iamSandy_Off @santhybee @AKunjamma pic.twitter.com/cvu4XHDzi5
— Wayfarer Films (@DQsWayfarerFilm) September 3, 2025