CM Siddaramaiah | మోదీ ఏ విమానంలో ప్రయాణిస్తున్నారో బీజేపీని అడగాలి : సిద్ధరామయ్య
కర్నాటక కరవు కోరల్లో అల్లాడుతుంటే సీఎం లగ్జరీ విమానంలో విహరిస్తున్నారని బీజేపీ చేసిన విమర్శలకు సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) దీటుగా కౌంటర్ ఇచ్చారు.
బెంగళూర్ : కర్నాటక కరవు కోరల్లో అల్లాడుతుంటే సీఎం లగ్జరీ విమానంలో విహరిస్తున్నారని బీజేపీ చేసిన విమర్శలకు సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) దీటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎలా ప్రయాణిస్తారో కాషాయ పార్టీని అడగాలని అన్నారు. మోదీ ఏ విమానంలో ఒంటరిగా ప్రయాణిస్తారని బీజేపీ సభ్యులను అడగాలని పేర్కొన్నారు. అసలు మోదీ ఒంటరిగా ఎందుకు ప్రయాణిస్తారో నేరుగా బీజేపీ నేతలనే అడగాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ నేపధ్యంలో బీజేపీ నేత అమిత్ మాలవీయ కర్నాటక సీఎం సిద్ధరామయ్య లగ్జరీ విమానంలో ప్రయాణిస్తున్న వీడియోను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. కరవు సహాయక నిధులను అడిగేందుకు సిద్ధరామయ్య తన మంత్రివర్గ సహచరుడితో కలిసి లగ్జరీ ప్రైవేట్ విమానంలో ఢిల్లీ వెళ్లారని మాలవీయ ఎద్దేవా చేశారు.
ఇక ఈ వివాదంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ ముఖ్యమంత్రులు ప్రైవేట్ విమానాల్లో ప్రయాణించడం సహజమేనని పేర్కొన్నారు. అధికారిక పనుల కోసం ప్రైవేట్ విమానాల్లో వెళ్లడం సహజమేనని, ఇందులో తప్పేమీ లేదని స్పష్టం చేశారు.
Read :
Captain Miller | యాక్టింగ్ మాన్స్టర్ ధనుష్.. కెప్టెన్ మిల్లర్ ఆన్ ది వే
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

