ఇస్లామాబాద్, డిసెంబర్ 22: భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’పై పాక్ సర్వ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ‘దైవిక సాయమే’ తమ దేశాన్ని కాపాడిందంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన నేషనల్ ఉలేమా కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు.
ఇందులో ఆయన చేసిన ప్రసంగం వీడియోల ప్రకారం.. ‘భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ ఘోరంగా దెబ్బతిన్న సమయంలో సాయుధ దళాలకు దైవిక సాయం అందింది. దానిని మేం ఫీల్ అయ్యాం’ అని మునీర్ అన్నారు.