వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొందరు మహిళలతో కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న ఫొటోను ఆన్లైన్ ఎప్స్టీన్ ఫైల్స్లో ఆదివారం పునరుద్ధరించారు. ఇది రెండు వేర్వేరు ఫొటోలతో కూడిన ఫొటో. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(డీవోజే) వెబ్సైట్లో శుక్రవారం మొదట దీనిని ప్రచురించారు. జెఫ్రీ ఎప్స్టీన్ డెస్క్ మీద అనేక వస్తువులు ఉన్నట్లు ఈ ఫొటోలో కనిపించింది.
అయితే ఈ ఫొటోను వెబ్సైట్ నుంచి తొలగించడంపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమైంది. ఈ ఫొటోల్లో ఒకదానిలో ట్రంప్ కొందరు మహిళలతో ఉన్నట్లు, రెండో ఫొటోలో తన భార్య మెలానియాతో కలిసి ఉన్నట్లు కనిపించింది.