ఉదయ్‌భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సెకండ్ ఇన్నింగ్స్’. చిత్రం శ్రీను. అఖిల్, సోమాలి, లిరిష కీలక పాత్రధారులు. జ్ఞానేశ్వరి వేదవ్యాస్ ఆకుల నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకున్నది.
ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి మేకర్స్ మాట్లాడుతూ ‘ఉదయ్‌భాస్కర్ అభినయమే ప్రధాన బలంగా ఈ సినిమా రూపొందుతున్నది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. భావోద్వేగాలు మెండుగా ఉండే చిత్రమైన కథ ఇది. సాంకేతికంగా కూడా సినిమా ఆకట్టుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం.’ అని తెలిపారు. ఈచిత్రానికి మాటలు: యు.వెంకట్, కథ, కథనం: గోవింద్ పొడుపు.