ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ ( Nirmal District ) మండలంలో నిర్వహించిన భూ భారతి ( Bhubharathi ) సదస్సులో రైతుపై చేయి చేసుకున్న ఏఎస్సైను జిల్లా పోలీసు అధికారులు సస్పెన్షన్ ( Suspension ) చేశారు. మండలంలోని పాతేలాపూర్ గ్రామపంచాయతీలో భూ భారతి సదస్సు జరిగింది. భూ సమస్యను పరిష్కరించే దశలో గ్రామాల వారీగా భూభారతి సదస్సును బుధవారం తహసీల్దార్ సుజాత రెడ్డి నిర్వహించారు .
ఈ సందర్భంగా అల్లెపు వెంకటి అనే రైతు తన భూ సమస్యను అధికారులకు వెల్లడించే క్రమంలో స్థానిక ఏఎస్సై రాంచందర్ రైతును ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి బయటకు తోసేశారు. ఈ విషయమై పలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్పందించారు. రైతుపై చేయిచేసుకున్న ఏఎస్సై రామచందర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.