కోల్‌కతా: భారత మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ దిండాపై ఈస్ట్ మిడ్నాపూర్‌లో ఓ దుండగుల గుంపు దాడికి పాల్పడింది. మొయినా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న దిండాపై మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. మొయినా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అతను వెళ్తున్న కారుపై సుమారు 50 మంది రాళ్ళు రువ్వినట్లు చెబుతున్నారు. ఈ దాడిలో అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు.
37ఏండ్ల దిండాపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఆరోపిస్తోంది.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థులు ప్రచారాన్ని ఒకరినొకరు అడ్డుకుంటున్నారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి.
West Bengal: Former cricketer and BJP candidate from Moyna, Ashok Dinda attacked by unidentified people in Moyna. Details awaited. pic.twitter.com/wxu6mT335v
— ANI (@ANI) March 30, 2021
సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..వార్నర్ వచ్చేస్తున్నాడోచ్!
కొత్త కొత్తగా..పంజాబ్ కింగ్స్ జెర్సీ
బబుల్ నుంచి బయటపడిన కోహ్లి.. ఇంట్లో ఫొటో షేర్ చేసిన కెప్టెన్