తుంగతుర్తి, మార్చి 31 : రాష్ట్రంలోని ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై మంగళవారం ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు మేకల జయమ్మ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, ఆశా వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు జిలకర రాజేశ్వరి, సుజాత, సునీత, రామ, కోటీ, పద్మ, కమల, మాధురి, ఉమా, యాకలక్ష్మి, ఆదాంబి పాల్గొన్నారు.