తుంగతుర్తి, మార్చి 31 : తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో సహాయ వంట మనిషి పోస్టుకు అర్హత ఉన్న మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి బోయిని లింగయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని, అలాగే వంట పనిలో అనుభవం ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రంలోగా కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రత్యేక అధికారికి దరఖాస్తు అందజేయాలని పేర్కొన్నారు.