Iran-US : అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత తీవ్రతరం కానుంది. ఇరాన్‌పై దాడుల్ని ఇంకా తీవ్రం చేసేందుకు పశ్చిమాసియాలో అమెరికా భారీ దళాల్ని మోహరిస్తోంది. యూఎస్ఎస్ ట్రిపోలి నౌకలో 3,500 ట్రూపుల్ని రంగంలోకి దించింది. ఇప్పటికే ఈ సైన్యం యుద్ధ ప్రభావిత ప్రాంతమైన పశ్చిమాసియా చేరుకుంది. ముఖ్యంగా ఇరాన్ సమీప దీవుల్తోపాటు, ఇరాన్‌పై అవసరమైతే భూతల దాడులు చేయాలని అమెరికా భావిస్తోంది.
ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. అమెరికాను ఎదుర్కోవడానికి తమ సైన్యమైన ఎలైట్ కమాండోస్ సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో ఇరాన్ ఎలైట్ కమాండోస్ యుద్ధ సన్నాహాల్లో ఉన్నారు. ఆయుధాలు ప్రయోగించడం, శతృవుల్ని ఎదుర్కోవడం వంటి వాటికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ‘‘దమ్ముంటే దగ్గరకు రండి. మేం మీ కోసమే ఎదురుచూస్తున్నాం’’ అంటూ సందేశాన్ని అమెరికా సైన్యానికి పంపింది. అమెరికా దాడుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అంతకుముందు కూడా వారికి ఇరాన్ ఇలాంటి హెచ్చరికే జారీ చేసింది.
Iran’s Army released footage of its elite commandos, declaring it is ready to confront and defeat American soldiers.
Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/gIdaV4W8lI
— Press TV 🔻 (@PressTV) March 31, 2026
అమెరికన్ దళాలు అక్కడి పర్షియన్ షార్క్‌లకు మంచి ఆహారంగా మారడం ఖాయమని హెచ్చరించింది. మరోవైపు తాజా యుద్ధంపై ఇంకోవైపు చర్చల ప్రతిపాదన కూడా కొనసాగుతోంది. అమెరికా ఒకవైపు బలగాల్ని మోహరిస్తూనే, మరోవైపు ఇరాన్‌తో చర్చలు జరపాలని భావిస్తోంది. దాడులు ఇంకా తీవ్రతరం కాకముందే ఇరాన్ యుద్ధం ముగించాలని ట్రంప్ కోరుతున్నాడు.