హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఐదురోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ద్రోణి, గాలి అనిశ్చితితో పాటు ఉపరితల చక్రవాకం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఆ ప్రకటనలో తెలిపింది.
మంగళ, బుధ వారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఈ సందర్భంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు వెల్లడించారు.