న్యూఢిల్లీ : విపక్ష ఇండియా కూటమిలో చేరిక కోసం తనను ఆహ్వానించకపోవడంపై ఏఐఎంఐఎం చీఫ్ (Asaduddin Owaisi), ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇండియా కూటమిలో చేరాలని తమ పార్టీని ఆహ్వానించకపోవడాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. విపక్ష కూటమిలో కేసీఆర్‌తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో పలు పార్టీలు భాగస్వాములు కాలేదని గుర్తుచేశారు.
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు చొరవ చూపాలని తాను తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరానని చెప్పారు.కేసీఆర్ ఈ దిశగా ముందుకువస్తే దేశంలో నెలకొన్న రాజకీయ శూన్యతను భర్తీ చేయవచ్చని అన్నారు. గతంలోనూ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఓవైసీ కోరారు. కేసీఆర్ చొరవ తీసుకుంటే పలు రాజకీయ పార్టీలు, నేతలు ఆ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇక ఇండియా కూటమిలోని లౌకిక పార్టీలు చెప్పుకునే పార్టీలు తమను రాజకీయంగా అంటరానివారిగా చూస్తున్నాయని ఏఐఎంఐఎం నేత వారిస్ పఠాన్ ఈ ఏడాది జులైలో అన్నారు. గతంలో బీజేపీతో అంటకాగిన నితీష్ కుమార్, ఉద్ధవ్ ఠాక్రే, మెహబూబా ముఫ్తీ వంటి నేతలు ఆ కూటమిలో ఉన్నారని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు బెంగళష్ట్రర్ భేటీకి హాజరయ్యారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీని ఓడించేందుకు కసరత్తు సాగిస్తున్నా ఇండియా కూటమి అసదుద్దీన్ ఓవైసీని, తమ పార్టీని విస్మరిస్తున్నాయని వారిస్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
Road accident | మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు నలుగురు మృతి