Online Investment Scam : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల నుంచి అందినకాడికి దోచేస్తున్నారు. లేటెస్ట్గా పుణేకు చెందిన ఓ ఆర్మీ వైద్యుడిని సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ. 1.2 కోట్లకు మోసగించారు. ఈ ఏడాది జులైలో బాధిత డాక్టర్‌ను ఓ లింక్ ద్వారా స్కామ్స్టర్లు వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఆపై సభ్యులను ఆహ్వానించిన గ్రూప్ అడ్మిన్లు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి అధిక రిటన్స్ రాబట్టడంపై చర్చిస్తూ ఆకట్టుకున్నారు.
వీరి మాటలు నమ్మిన బాధితుడికి స్కామర్లు ట్రేడింగ్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అయితే ఈ యాప్‌ను యూజర్ల నుంచి నిధులను దారిమళ్లించే ఉద్దేశంతో ఏర్పాటైన తప్పుడు ప్లాట్‌ఫాంగా గుర్తించారు. ఇక స్కామర్ల స్కెచ్‌లో పడ్డ బాధిత డాక్టర్ 40 రోజుల పాటు సాగిన దాదాపు 35 లావాదేవీల్లో ఏకంగా రూ. 1.22 కోట్లు సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలకు బదలాయించాడు. ప్రతి లావాదేవీని ప్లాట్‌ఫాంపై ఇన్వెస్ట్మెంట్గా చూపారు.
ఆ పెట్టుబడిపై బాధితుడు రూ. 10.26 కోట్ల రాబడి పొందినట్టు రికార్డుల్లో పొందుపరిచారు. ఇక ఇతర స్కామ్‌ల్లో మాదిరే డాక్టర్ సైతం పెట్టుబడులపై తనకు వచ్చిన లాభాన్ని విత్‌డ్రా చేసుకునే సమయంలో తన లాభాల్లో 5 శాతం అంటే రూ. 45 లక్షలను ఫీజు కింద చెల్లించాలని స్కామర్లు డిమాండ్ చేశారు. తాము అడిగిన మొత్తం చెల్లించనిపక్షంలో బ్యాంకుల్లో ఆయన నిధులు ఫ్రీజ్ అవుతాయని బెదిరించారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత డాక్టర్ పుణేలో సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Read More :
Mahbubnagar | దొంగతనానికి వచ్చి.. కరెంట్ షాక్‌తో ఇద్దరు దొంగలు మృతి