Arjun Rampal | భగవంత్ కేసరి ఫేం, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయినట్లు తెలిపాడు. తన అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు కానీ, ట్విట్లకు కానీ స్పందించకండి అంటూ రాంపాల్ వెల్లడించాడు. తన అకౌంట్ హ్యాక్‌పై సైబర్ పోలీసులకు కంప్లయింట్ చేశానని త్వరలోనే మీ ముందుకు వస్తానని వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ప్రముఖుల ఖాతాలు హ్యాక్ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో బాలీవుడ్ ఫేమస్ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్‌తో పాటు నటులు షాహిద్ కపూర్, అర్షద్ వార్సీ, గోవిందా తదితరుల ఖాతాలు హ్యాక్‌కు గురయ్యాయి. ఇక తెలుగులో కూడా అగ్ర నటుడు ప్రభాస్ ఇన్‌స్టా కూడా అప్పట్లో హ్యాక్‌కి గురైంది. అయితే అర్జున్ రాంపాల్ ఖాత్ హ్యాక్ అవ్వడంతో తన అభిమానులను అప్రమత్తంగా ఉండాలని కోరాడు. మరోవైపు సెలబ్రిటీల ఖాతాలే హ్యాక్ అవుతున్నాయి. మా పరిస్థితి ఏంటి అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read..