Mr Bachchan Movie | అగ్ర కథానాయకుడు రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదలకు ఇంకా 04 రోజులే ఉండడంతో ప్రమోషన్స్ సూపర్ ఫాస్ట్‌గా నిర్వహిస్తుంది. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను అనౌన్స్ చేసింది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున్న మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ను ఇచ్చారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్స్‌లో ఆగష్టు 12న నిర్వహించబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. మిరపకాయ్ సినిమా తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
#MrBachchan Grand Pre Release Event tomorrow At STBC grounds, KURNOOL 💥💥
Book your free passes now!!
– https://t.co/2b3dvO6ch0GRAND RELEASE WORLDWIDE ON AUGUST 15th. Premieres on August 14th.#MassReunion pic.twitter.com/TLMyu1UzaY
— BA Raju’s Team (@baraju_SuperHit) August 11, 2024
Also Read..
Radhika Madan | అందం కోసం ఆ పని చేయడం తప్పుకాదు: రాధికా మదన్
Anganwadi | అంగన్వాడీ సిబ్బంది నిర్వాకం.. ప్లేట్లలో గుడ్లు పెట్టి వెంటనే లాగేసుకున్నారు
Aman Sehrawat | 10 గంటల్లో 4.6కిలోలు.. బరువు తగ్గేందుకు రాత్రంతా కష్టపడ్డ రెజ్లర్ అమన్