Anganwadi | బెంగళూరు, ఆగస్టు 10: చిన్న పిల్లలకు పెట్టిన ఆహారాన్ని ఎవరైనా లాగేసుకుంటారా? కానీ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఓ అంగన్వాడీ కేంద్రం సిబ్బంది ఆ పని చేశారు. కప్పాల్ జిల్లా కారంటాగి తాలూకా గుందుర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సిబ్బంది చేసిన ఈ మోసంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది.
ల్లల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించిన అంగన్వాడీ హెల్పర్, వర్కర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పిల్లలతో ప్రార్థన చేయించిన వెంటనే కొన్ని సెకన్ల వ్యవధిలో వారి ప్లేట్ల నుంచి గుడ్లను అంగన్వాడీ హెల్పర్, వర్కర్ తీసేసుకున్న తీరు వీడియోలో రికాైర్డెంది. పిల్లలకు గుడ్డు పెట్టామని చూపుకునేందుకే సిబ్బంది ఇలాంటి మోసం చేశారని తెలుసుకొని ప్రజలు అవాక్కయ్యారు.