కాసిపేట, డిసెంబర్ 2 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మల్కెపల్లి గ్రామ పంచాయతీ షెడ్యూల్ ఏరియాపై పలువురు గ్రామస్తులు హై కోర్టును ఆశ్రయించగా మంగళవారం వాదనలు కొనసాగాయి. వచ్చే వారంలో తీర్పు విలువడే అవకాశం ఉందని ఈ కేసును వాదిస్తున్న హై కోర్టు న్యాయవాది వెంటేశ్వర్లు తెలిపారు. రెవెన్యూ రికార్డులకు విరుద్ధంగా నాన్ షెడ్యూల్ ఏరియాగా ఉన్న మల్కెపల్లి గ్రామాన్ని అధికారులు షెడ్యూల్ ఏరియాగా కొనసాగిండం అన్యాయమని, దీనిపై చర్యలు తీసుకొని మల్కెపల్లి గ్రామ పంచాయతీని నాన్ షెడ్యూల్ ఏరియాగా ప్రకటించాలని కోరుతూ గ్రామానికి చెందిన కసాడి శ్రీనివాస్, పలువురు గ్రామస్తులు హై కోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు నాన్ షెడ్యూల్ ఏరియా ఉన్నటువంటి అన్ని ఆధారాలు సమర్పించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో అన్ని ఆధారాలు ఉండగా వచ్చే వారం తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని, నాన్ షెడ్యూల్ ఏరియాగా ప్రకటించే విధంగా అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని న్యాయవాది తెలిపారు.