Paleru farmer | కాంగ్రెస్ పాలనలో రైతులకు అవస్థలు తప్పడం లేదు.. ఓ వైపు ఆలస్యమైన వర్షాలు, మరోవైపు యూరియా కొరత, కరెంట్ కోతలతో సతమతమవుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ కరెంట్ కోతలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో రైతుల ఆందోళనకు దిగారు. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కేంద్రంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు.. వరుస కరెంట్ కోతల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఓ రైతన్న మాట్లాడుతూ..మా ప్రాంతం మధిర నియోజకవర్గం.. ఇటు గువ్వలగూడెం దగ్గర నుంచి అవతల మధిర నియోజకవర్గం అక్కడ 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. మరి మనం పాకిస్తాన్లో ఉన్నామా.. పాలేరులో ఉన్నామా..? మంత్రి చెప్పాలన్నారు. ఈ నియోజకవర్గానికి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వారు చెప్పాలి సమాధానం.. పక్కనే కూతవేటు దూరంలో ఉన్న మండలంలోనేమో 24 గంటల కరెంట్ ఇస్తరు.. మన దగ్గరనేమో రోజుకు 6, 8 నుంచి 10 గంటల మధ్యలో ఇస్తారరంటూ ఫైర్ అయ్యారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో రైతుల ఆందోళన
పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కేంద్రంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు
వరుస కరెంట్ కోతల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా రైతుల నిరసన https://t.co/He4EDQk3VF pic.twitter.com/im91pRfw8W
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026