ముంబై: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్(T20 Series)తో పాటు ఆసియా క్రీడలకు చెందిన టీ20 జట్టుకు బౌలర్ యశ్ థాకూర్(Yash Thakur)ను తీసుకున్నారు. గాయపడ్డ హర్షిత్ రాణా స్థానంలో యశ్ థాకూర్‌ను ఎంపిక చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇండియా మూడు టీ20లు ఆడనున్న విషయం తెలిసిందే. హర్షిత్ రాణా ప్రస్తుతం బెంగుళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. ఇక విదర్భకు చెందిన 27 ఏళ్ల యశ్ థాకూర్ ఇటీవల జింబాబ్వేతో జరిగిన టూర్లో బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. రెండు మ్యాచుల్లో అతను 4 వికెట్లు తీసుకున్నాడు. 50 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచుల్లో ఆడాడు. వాటిల్లో 81 వికెట్లు తీసుకున్నాడు.
ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు క్లియరెన్స్ దక్కింది. ఆఫ్ఘన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అతను ఆడనున్నాడు. బుమ్రా ఫిట్‌గా ఉన్నట్లు బోర్డు చెప్పింది. ఫిట్నెస్ ఉంటేనే ఆఫ్ఘన్‌తో సిరీస్‌కు క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు గతంలో బోర్డు పేర్కొన్న విషయం తెలిసిందే. బుమ్రాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌కు కూడా క్లియరెన్స్ దక్కింది. జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేకు బుమ్రా దూరం అయ్యాడు. ఆ తర్వాత శ్రీలంకలో జరిగిన రెండు టెస్టులకు కూడా అతను దూరంగా ఉన్నాడు. సెప్టెంబర్ 13 నుంచి ఆఫ్ఘన్‌తో టీ20 సిరీస్ ప్రారంభంకానున్నది.
🚨 News 🚨
Yash Thakur replaces Harshit Rana in India’s T20Is squads for Afghanistan T20Is & Asian Games
More Details ▶️ https://t.co/qh86ExSbgB #TeamIndia | #AFGvIND | #AsianGames
— BCCI (@BCCI) September 10, 2026