KTR | టీ హబ్ వేదికగా ఏర్పడ్డ స్కైరూట్ సంస్థ శ్రీహరికోటలో చేపట్టిన విక్రమ్–1 రాకెట్ ప్రయోగ విజయవంతం కావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ సరూర్ నగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.. టీ హబ్‌లో పురుడు పోసుకున్న కంపెనీ పేరు స్కైరూట్. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు అయింది. ఇవాళ భారతదేశ చరిత్రలో ఒక ప్రైవేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిన ఆ కంపెనీ మన టీహబ్ నుంచే వచ్చిందన్నారు.
ఇవాళ ఉదయమే ప్రయోగం విజయవంతంగా నిర్వహించారు. ఈ రోజు శ్రీహరికోట నుంచి ప్రైవేట్ రాకెట్‌ను పంపిన స్కైరూట్ కంపెనీకి చప్లట్లతో అభినందనలు తెలుపాలని కేటీఆర్ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. ఇస్రో నుండి తొలిసారి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సక్సెస్ అవడంతో స్కైరూట్ కంట్రోల్ సెంటర్లో సంబురాలు చేసుకుంటున్నారు.
టీ హబ్‌లో పురుడు పోసుకున్న స్కైరూట్ అనే కంపెనీ ఈరోజు శ్రీహరికోట నుంచి ప్రైవేట్ రాకెట్‌ను పంపింది
79 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఓ ప్రైవేట్ కంపెనీ రాకెట్‌ను పంపడం ఇదే మొదటిసారి
– కేటీఆర్ https://t.co/fWiMzX6RJB pic.twitter.com/oTZxZz35Qv
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026