అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) తెలంగాణపై మరోసారి అక్కసును వెల్లగక్కాడు. 60 ఏళ్లు కష్టపడి హైదరాబాద్ ( Hyderabad) ను అభివృద్ధి చేస్తే 2014లో కట్టుబట్టలతో బయటకు గెంటేశారని ఆరోపించారు. హైదరాబాద్‌ను చూస్తే అసూయగా ఉందని అన్నారు.
దేశవ్యాప్తంగా శుక్రవారం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏపీలోని మంగళగిరి రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకో 3 సంవత్సరాలు ఏపీ నిరుద్యోగులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదని , పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులే ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా పెట్టుబడులు తెస్తున్నామని వెల్లడించారు.