Andy Burnham: లేబర్ పార్టీ నేతగా ఆండీ బర్న్‌హమ్.. త్వరలో బ్రిటన్ ప్రధాని !
Andy Burnham: బ్రిటన్‌లోని లేబర్ పార్టీ నేతగా ఆండీ బర్న్‌హమ్ కన్ఫర్మ్ అయ్యారు. తన నాయకత్వంలో పార్టీని నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. మాజీ ప్రధాని కీర్ స్టార్మర్ ఆశయాలకు తగినట్లు పార్టీని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
లండన్: బ్రిటన్‌లోని లేబర్ పార్టీ నేతగా ఆండీ బర్న్‌హమ్(Andy Burnham) కన్ఫర్మ్ అయ్యారు. తన నాయకత్వంలో పార్టీని నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మాజీ ప్రధాని కీర్ స్టార్మర్ ఆశయాలకు తగినట్లు పార్టీని నిర్మించనున్నట్లు చెప్పారు. పార్టీ నేతగా స్టార్మర్ ఉన్న సమయంలో.. ఓటమి దశ నుంచి పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసిందని, లేబర్ పార్టీ ఇప్పుడు ప్రజల జీవితాలను మార్చేస్తోందన్నారు. వచ్చే వారం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రధాని బాధ్యతలు ఆండీ బర్న్‌హమ్ స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. లేబర్ పార్టీ నేతగా ఆండీ బర్న్‌హమ్ నియమితుడైన విషయాన్ని ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మెన్ షాబానా మహమూద్ ప్రకటించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆండీ బర్న్హమ్ను సోమవారం మూడవ కింగ్ చార్లెస్ ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. కీర్ స్టార్మర్ తన రాజీనామా సమర్పించిన తర్వాత ఈ ప్రక్రియ జరగనున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

