Watch: వృద్ధురాలి ఫ్లాట్‌ను ఆక్రమించిన బీజేపీ నేత.. గుడ్లతో దాడి చేసిన స్థానికులు
Eggs fly at BJP leader | వృద్ధురాలి ఫ్లాట్‌లో అద్దెకు నివసించిన బీజేపీ నేత గడువు ముగిసినప్పటికీ ఖాళీ చేయలేదు. అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను బలవంతంగా ఆక్రమించుకున్నాడు. స్థానికుల ఆందోళనతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ బీజేపీ నేతను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా స్థానికులు గుడ్లతో దాడి చేశారు.
కోల్‌కతా: వృద్ధురాలి ఫ్లాట్‌లో అద్దెకు నివసించిన బీజేపీ నేత గడువు ముగిసినప్పటికీ ఖాళీ చేయలేదు. అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను బలవంతంగా ఆక్రమించుకున్నాడు. స్థానికుల ఆందోళనతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ బీజేపీ నేతను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా స్థానికులు గుడ్లతో దాడి చేశారు. (Eggs fly at BJP leader) బీజేపీ కొత్తగా అధికారంలోకి వచ్చిన పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది. న్యూటౌన్ బీజేపీ నేత బరున్ బిస్వాస్ 2018లో ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. అద్దె ఒప్పందం గడువు ముగిసిన తర్వాత యజమాని పదేపదే కోరినప్పటికీ ఖాళీ చేసేందుకు నిరాకరించారు. వృద్ధురాలికి చెందిన ఫ్లాట్‌ను ఆక్రమించేందుకు ఆయన ప్రయత్నించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బీజేపీ నేత బరున్ బిస్వాస్ తీరుపై ఆగ్రహించారు. ఆ అపార్ట్మెంట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్థానికులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
మరోవైపు వృద్ధురాలి ఫిర్యాదుతో బరున్ బిస్వాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా స్థానికులు గుడ్లతో దాడి చేశారు. ‘దొంగా.. దొంగా’ అని నినాదించారు. టీఎంసీ నాయకులపై గుడ్లు విసరడంతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు అధికార బీజేపీ నేతలకే చుట్టుకున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Bengalis have started giving BJP leaders the egg treatment too.
Barun Biswas, a prominent BJP leader, was arrested for illegally occupying an elderly woman’s flat since March 2019 and failing to pay ₹16 lakh in rent.
As he was being taken into custody, locals gave him a… pic.twitter.com/4NrjpNxv2t
— ज़िद्दी नागरिक (@ZiddiNaagrik) July 17, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP leader
- eggs
- flat
- fly
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

