శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు ప్రమాణస్వీకారంపై ఏపీ హైకోర్టు స్టే.. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా..
అమరావతి: అమరావతి: శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ట్రస్ట్ బోర్డు నియామకాన్ని సవాల్ చేస్తూ కొర్రా శ్రీనివాసులు నాయక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.
అమరావతి: అమరావతి: శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ట్రస్ట్ బోర్డు నియామకాన్ని సవాల్ చేస్తూ కొర్రా శ్రీనివాసులు నాయక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం. బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మకర్తల మండలి ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఆదివాసీ చరిత్ర కలిగిన ఆలయంలో గిరిజనుల ప్రాతినిధ్యం లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇద్దరు హిందూ తత్వవేత్తలు ఉండాలనే నిబంధనను ఉల్లంఘించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆలయంపై అవగాహన లేని సభ్యులను ట్రస్టు సభ్యులుగా నియమించారని మండిపడ్డారు. వాదనల అనంతరం బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని మూడు వారాల పాటు నిలిపివేసిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ట్రస్టుబోర్డులో 15 మందిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న ట్రస్టు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

