AP News | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చూస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది. 2024 జనవరి 1వ తేదీ నుంచి పెరిగిన భత్యం అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
పెరిగిన డీఏతో పాటు సంబంధిత బకాయి కూడా త్వరలోనే విడుదల చేస్తామని ఏపీ ఆర్థిక శాఖ ప్రకటించింది. కాగా, ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఒక డీఏను ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే, నాలుగు డీఏలకు గానూ ఒక డీఏను మాత్రమే విడుదల చేయడం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.