ఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Murmu), ప్రధాని మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ శుభాకాంక్షలు (Diwali Greetings) తెలిపిన రాష్ట్రపతి ముర్ము.. అందరికి ఆనందం, శాంతి, శ్రేయస్సు నిండిన దీపావళలి కావాలని ఆకాంక్షించారు. ఈ వేలుగుల పండుగ మన జీవితాల్లో సామరస్యం, ఆనందం, శ్రేయస్సును తీసుకురావాలని ప్రధాని మోదీ అన్నారు.
‘దీపావళి భారతదేశం ప్రధాన, ప్రసిద్ధ పండుగ. ఇది చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశాన్ని ఇస్తుంది. ఈ రోజున ప్రజలు తమ ఇండ్లల్లో లక్ష్మీ దేవిని పూజించి ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగ ఆత్మపరిశీలన, స్వీయ-అభివృద్ధికి కూడా ఒక అవకాశం. దీపావళి రోజున ఒక దీపం నుంచి ఎన్ని దీపాలు వెలిగిస్తామో, అదే విధంగా సమాజంలోని పేద, నిరుపేద ప్రజలకు సహాయం చేసి వారి జీవితాల్లో ఆనందాన్ని పొందవచ్చు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఈ పండుగను సురక్షితంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలను, శాంతిని, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
दीपावली के शुभ अवसर पर मैं, भारत और विदेश में रह रहे सभी भारतीयों को बधाई और शुभकामनाएं देती हूं। pic.twitter.com/1Ealry6tam
— President of India (@rashtrapatibhvn) October 20, 2025
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ దీపాల పండుగ మన జీవితాల్లో సామరస్యం, ఆనందం, శ్రేయస్సును ప్రకాశింప చేస్తుంది. సానుకూలత ఆత్మ మన చుట్టూ ప్రబలంగా ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశారు.
Greetings on the occasion of Diwali. May this festival of lights illuminate our lives with harmony, happiness and prosperity. May the spirit of positivity prevail all around us.
— Narendra Modi (@narendramodi) October 20, 2025