అమరావతి : ఏపీలో మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ము, ధైర్యముంటే తనకు లై డిటెక్టర్ ( Lie detector) చేయాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) సవాల్ చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎలాగైనా జైలులో ఉంచాలనే దురుద్దేశ్యంతో తనపై తప్పుడు కేసులు బనాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత వైసీపీ పాలనపై కల్తీ మద్యం, మద్యం కుంబకోణం కేసులు పెట్టి వేదింపులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతుందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన కల్తీని వైసీపీ రుద్దే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. నకిలీ మద్యం ఎక్కడ తయారయింది. ఎక్కడకు సరఫరా అయిందో ప్రభుత్వం తేల్చలేకపోతుందని ఆరోపించారు.
ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న అద్దెపల్లి జనార్ధన్‌తో టీడీపీ కుమ్మకై వైసీపీ నాయకులపై కుట్రలు పన్నుతుందని పేర్కొన్నారు. తాను ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతుందని, కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ఏపీలో ఫేక్ ప్రభుత్వం, ఫేక్ చంద్రబాబు, లోకేష్ అని విమర్శించారు.