Harish Rao | రాష్ట్రంలో మేము అగ్రికల్చర్‌ను పెంచితే.. మీరు గన్ కల్చర్‌ను పెంచుతున్నారు.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) దర్శించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) దర్శించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయల పండితులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ అంటేనే మతసామరస్యానికి ప్రతీక అని చెప్పారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ హత్య అత్యంత విచారకరమన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. పోలీసులకు రక్షణ లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
అధికార పార్టీ నేతలు పారిశ్రామిక వేత్తలను గన్లతో బెదిరిస్తున్నారని విమర్శించారు. మంత్రి కూతురు ఆరోపణలపై సిట్టింగ్ జడ్జిత్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకపోతే మంత్రి ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను గుండా రాజ్యంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడి దారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెడ్కార్పేట్తో స్వాగతం పలికిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందని ధ్వజమెత్తారు. పెట్టుబడిదారుల వద్ద అక్రమ వసూళ్లు చేసి పంచుకోవడంలో తేడాలొచ్చి తన్నుకు చస్తున్నారని విమర్శించారు. పెట్టుబడిదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తాము అగ్రికల్చర్ పెంచితే, వాళ్లు గన్ కల్చర్‌ను పెంచుతున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఉన్న తేడా అదేనని చెప్పారు.
Live: భాగ్యలక్షి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/DAuAP8syJm
— BRS Party (@BRSparty) October 20, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సును పగులగొట్టిన వైసీపీ..!
AP News | కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..!
Delhi Building Collapse | మా ఇల్లే కూలిపోతుందేమోనని పరుగులు పెట్టాం.. ఢిల్లీ ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి
‘ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు’
Rahul Gandhi | నాతో చర్చకు వస్తే మోదీ దేశ ద్రోహి అని ఐదు నిమిషాల్లో నిరూపిస్తా : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

