తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి రాజోలు భామ అంజలి (Anjali). సంప్రదాయబద్దంగా తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తూ..తన సినిమాలతో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంజలి ప్రస్తుతం శంకర్-రాంచరణ్ కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ఆర్సీ 15లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
కాగా మరోవైపు ఝాన్సీ (Jhansi web series) టైటిల్‌తో వస్తున్న వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది అంజలి. ఝాన్సీ వెబ్ సిరీస్ తాజాగా హెడ్ లైన్స్‌లో నిలిచింది. ఈ వెబ్ ప్రాజెక్ట్ ఎప్పుడు విడులవుతుందో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 27 నుంచి ఝాన్సీ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సిరీస్‌ను తిరు డైరెక్ట్ చేస్తున్నాడు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది యువ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది అంజలి. రా రా రెడ్డి అంటూ సాగే ఈ సాంగ్‌లో మెస్మరైజింగ్ స్టెప్పులతో అదరగొట్టేసింది అంజలి.
A new story on a new date! #JhansiOnHotstar premieres October 27, only on @DisneyPlusHSTel.@Actor_Krishna @dir_thiru @yoursanjali @iChandiniC @TribalHorseOffl @SricharanPakala @editoranthony @twitavvi pic.twitter.com/NU1SeaUfx5
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 13, 2022
Read also : Sidhu Jonnalagadda | అట్లుంటది మనతోని.. డీజేటిల్లు 2 హీరోయిన్ ఎవరో చెప్పిన సిద్దు
Read also : Chiranjeevi | చిరంజీవిని కలిసిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు
Read also : Prakash Raj | ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ షురూ.. ఇంతకీ ఏ సినిమాకంటే..?
Read also : Kriti Sanon | ఆదిపురుష్ కొత్త అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కృతిసనన్