రామాయంపేట, ఆగస్టు 07 : తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రామాయంపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, యుక్త వయస్సు పిల్లలకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా అంగన్వాడీ సూపర్వైజర్ సృజన, భారతి మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన బిడ్డకు కచ్చితంగా ముర్రుపాలు పట్టాలన్నారు.
ముర్రుపాల ప్రాముఖ్యతపై తల్లులకు అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రు పాలు పట్టాలని దీంతో శిశువు ఆరోగ్యంగా ఉంటుందన్నారు. చిన్నారులకు అన్నప్రాసన, యుక్త వయస్సు పిల్లలకు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.