అమరావతి : బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు.
ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ సేవలను సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్రోద్యమ నాయకుడు, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.
పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది అని సీఎం జగన్ ట్వీటర్లో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి, ముఖ్యమంత్రి నివాసంలో నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్.జగన్. https://t.co/v6ytzrcnTE pic.twitter.com/mRBTi7bjDn
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 5, 2021