ఇల్లెందు, సెప్టెంబర్ 18 : ఇల్లెందు 21 ఫిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1985-86 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాము విద్యనభ్యసించిన పాఠశాలలోనే గురువారం ఆత్మీయంగా సమావేశమయ్యారు. నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదువుకునే రోజుల్లో చేసిన అల్లర్లు, ప్రస్తుతం జీవితంలో కొనసాగుతున్న ఒడిదుడుకులను పంచుకుంటూ రోజంతా సంతోషంగా గడిపారు. అనంతరం పాఠశాల తరగతి గదిలో ఫొటోలు, పాఠశాల ఎంట్రన్స్ లో గ్రూప్ ఫొటో తీసుకుని సాయంత్రానికి ఒకరికొకరు వీడ్కోలు తీసుకుని వెళ్లిపోయారు.
Yellandu : ఇల్లెందు 21 ఫిట్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం