SL vs AFG : ఆసియా కప్‌లో గ్రూప్ బీ సూపర్ 4 బెర్తులు మరికొన్ని గంటల్లో తేలిపోనున్నాయి. రేసులో ఉన్న శ్రీలంక(Srilanka), అఫ్గనిస్థాన్(Afghanistan) మ్యాచ్ ఫలితంతో ముందంజ వేసే రెండు జట్లు ఖరారవుతాయి. చివరి లీగ్ మ్యాచ్ కావడంతో విజయంతో ముగించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అబుదాబీ స్టేడియంలో జరుగుతున్ను పోరులో టాస్ గెలిచిన రషీద్ ఖాన్ బ్యాటింగ్ తీసుకున్నాడు.
లీగ్ దశలో హాంకాంగ్‌పై విజయంతో టోర్నీ ఆరంభించిన అఫ్గనిస్థాన్ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్నది. గ్రూప్ బీ నుంచి సూపర్ 4 పై కన్నేసిన రషీద్ సేన ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో ఆడుతోంది అఫ్గనిస్థాన్. ఘజన్ఫర్, గుల్బదిన్ నయూబ్ స్థానంలో సీనియర్లు ముజీబ్ రెహ్మాన్, రసూలీ జట్టులోకి వచ్చారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అతికష్టమ్మీద గట్టెక్కిన చరిత అలసంక టీమ్ సైతం ఒక మార్పు చేసింది. థీక్షణ బదులు దునిత్ వెల్లలాగే ఎంపికయ్యాడు. టీ20ల్లో ఇరుజట్లు ఎనిమిదిసార్లు తలపడగా.. లంక ఐదు విజయాలతో పైచేయి సాధించింది.
All roads from Group B lead right here… pic.twitter.com/CF0R5HDNEZ
— ESPNcricinfo (@ESPNcricinfo) September 18, 2025
అఫ్గనిస్థాన్ తుది జట్టు : సెడీఖుల్లా అటల్, రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, మొహమ్మద్ నబీ, డార్విస్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, రషీద్ ఖాన్(కెప్టెన్), ముజీబ్ రెహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారూఖీ.
శ్రీలంక తుది జట్టు : పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిల్ మిశారా, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక(కెప్టెన్), దసున్ శనక, కమిందు మెండిస్, హసరంగ, వెల్లలాగే, చమీర, నువాన్ తుషార.