ఇచ్చోడ, ఆగస్టు 21 : ‘నువ్వు వస్తే తప్ప మాకు ఆసరా పింఛన్ రాదు..సారు’ అంటూ బీఆర్ఎస్ పాలనను తలుచుకుంటూ కేసీఆర్ ఫ్లెక్సీకి దండాలు పెడుతూ, కాంగ్రెస్ సరార్ పింఛన్ ఇవ్వకుండా తమను మోసం చేసిందని ఓ వృద్ధుడు ఆవేదన వ్యక్తంచేశాడు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులు నిరస న తెలిపారు.
మూడేండ్లుగా సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని, నాడు రూ.200 ఉన్న పింఛన్‌ను కేసీఆర్ రూ.2వేలు చేసి ముసలోళ్లకు ఆసరాగా నిలిచారని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒకరికీ పింఛన్ ఇచ్చి ఆదుకున్న గొప్ప మనసున్న నేత కేసీఆర్ అని కొనియాడారు.