బ్రాటిస్లావా (స్లొవేకియా): అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ కాజల్ దోచాక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 76 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి వరుసగా రెండో ఏడాది అండర్-20 వరల్డ్ ప్రపంచ చాంపియన్గా నిలిచింది. తను శర్మ, సవిత రజత పతకాలతో మెరిశారు.18 ఏండ్ల కాజల్ 76 కేజీల ఫైనల్లో 7-0తో చైనా రెజ్లర్ జింగ్రూ సన్ను చిత్తు చేసి స్వర్ణం అందుకుంది.
గతేడాది 72 కేజీల విభాగంలో టైటిల్ గెలిచిన కాజల్, ఈసారి కేటగిరీ మారినా అదే జోరు కొనసాగించింది. ఇక 72 కేజీ ఫైనల్లో తను శర్మ 3-5తో చిసాటో యోషిడా (జపాన్) చేతిలో, సవిత (62 కేజీ)2-12తో సకురా ఓనిషి (జపాన) చేతిలో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు. మరోవైపు 68 కేజీల్లో మాన్సి లాథర్ ఫైనల్కు అర్హత సాధించింది.