మణుగూరు టౌన్, ఆగస్టు 21 : పాలిటెక్నిక్ విద్యను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 22న శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
విద్యార్థుల భవిష్యత్‌ను, వారి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా జీవోలు తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊర్కోదని, వారి హక్కుల కోసం ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. 22న ఉదయం 10 గంటలకు జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.