నందిగ్రామ్‌లో అమిత్‌షా భారీ రోడ్‌షో
కోల్‌కతా : రెండో విడుత ఎన్నికల ప్రచారానికి తెరదించడానికి కొన్ని గంటల ముందు నందిగ్రామ్‌లో బీజేపీ భారీ రోడ్‌షో నిర్వహించింది.

కోల్‌కతా : రెండో విడుత ఎన్నికల ప్రచారానికి తెరదించడానికి కొన్ని గంటల ముందు నందిగ్రామ్‌లో బీజేపీ భారీ రోడ్‌షో నిర్వహించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర పార్టీ కార్యకర్తలు, అభిమానులు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ రోడ్‌షోలో బీజేపీ మాజీ సారథి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పాల్గొన్నారు.
బీజేపీ జెండాలతో అలంకరించిన టాప్లేని వాహనంపై నిలుచుని ఉన్న అమిత్‌షా.. రోడ్‌షో ఆసాంతం కార్యకర్తలను, నాయకులను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగారు. తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నందిగ్రామ్‌లో బీజేపీ భారీ రోడ్‌షో చేపట్టడం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
గతంలో మమతా బెనర్జీ వెనుకే ఉండి నందిగ్రామ్‌లో తృణమూల్‌ను ముందుకు నడిపిన సువేందు అధికారి.. ఈసారి బీజేపీ అభ్యర్థిగా తన ప్రత్యర్థి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనే పోటీ చేస్తున్నారు. దాంతో ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్శిస్తున్నది.
తూర్పు మిడ్నాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బెతురియా, రాయపారా మధ్య నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు గుమిగూడారు. ‘జై శ్రీ రామ్’, ‘నరేంద్ర మోదీ జిందాబాద్’, ‘అమిత్ షా జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.
ఏప్రిల్ 1 న ఎన్నికలు జరుగనున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
మమతకు ఓటమి తప్పదు: అమిత్‌షా
నందిగ్రామ్‌లో ఇవాళ జరిగిన రోడ్‌షో చూస్తుంటే.. ఈ ప్రదర్శనకు హాజరైన వేలాది కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఇక్కడ మమత ఓటమి తప్పదని, సువేందు అధికారిదే విజమని అనిపిస్తుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అమిత్‌షా అన్నారు. బీజేపీ నిర్వహించిన భారీ రోడ్‌షో అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో పరివర్తనం రావాలంటే నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడటం ఒక్కటే అని ఆయన పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
మహిళా సహాయకురాలితో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి అసభ్య ప్రవర్తన
ధర్నాలో కూర్చున్న వారిపైకి దూసుకొచ్చిన కారు.. ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు
బ్రెజిల్లో వ్యాక్సిన్ కొరత.. విదేశాంగ మంత్రి రాజీనామా?
బొగ్గు అక్రమ రవాణా కేసులో సీబీఐ ఎదుట హాజరైన కింగ్‌పిన్ లాలా
బంగ్లాదేశ్‌లో మోదీ పర్యటన.. షేక్ హసీనా మెడపై కత్తి
రాజస్థాన్ ఆవిర్భావ దినం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

