e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home News మహిళా సహాయకురాలితో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడి అసభ్య ప్రవర్తన

మహిళా సహాయకురాలితో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడి అసభ్య ప్రవర్తన

మహిళా సహాయకురాలితో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడి అసభ్య ప్రవర్తన

మనీలా : వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలు చేసే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే మరోసారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. తన ఇంట్లో పనిచేసే మహిళా సహాయకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

తన 76 వ పుట్టిన రోజు సందర్భంగా అధికార నివాసంలో కుటుంబసభ్యులు సిద్ధం చేసిన కేకుపై పెట్టిన క్యాండిల్‌ ఊదారు. అనంతరం అక్కడే ఉన్న మహిళా సహాయకురాలు మరో కేకును రోడ్రిగో ముందుకు తీసుకురాగా.. ఆమె ప్రైవేట్‌ పార్ట్స్‌ను తాకేందుకు రోడ్రిగే ప్రయత్నిస్తూ చేతులు చాపాడు. అధ్యక్షుడి చేతికి చిక్కకుండా వెంటనే తమాయించుకుని వెనక్కి జరిగింది ఆ మహిళ. ఆ తర్వాత ఆ కేకుపై ఉన్న క్యాండిల్‌ను ఆర్పారు. ఈ చిలిపి పనులను పక్కను ఉండి ఆయన కుటుంబీకులు సైతం ఎంజాయ్‌ చేసినట్లుగా కనిపిస్తున్నది.

రోడ్రిగో డ్యూటెర్టే ఒక మహిళా సహాయకురాలిని అనుచితంగా తాకడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించే వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ వీడియోను చిత్రీకరించారు. డ్యూటెర్టే దావావో సిటీ ఇంటిలో చిత్రీకరించిన చిన్న క్లిప్‌లో.. ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఒక టేబుల్ వద్ద కూర్చుని ఉన్నారు. అతని కుటుంబ సభ్యులను కూడా వైరల్ వీడియోలో చూడవచ్చు.

ఈ వెదవ పనిని అధ్యక్షుడి అధికార ప్రతినిధి హ్యారీ రోక్ సమర్థించారు ‘ఎటువంటి హాని జరుగలేదు కదా’ అని కొట్టిపారేశారు. అంతటితో ఆగకుండా ‘అధ్యక్షుల వారికి జోకులంటే ఇష్టమని మీకు తెలుసు కదా! అయితే, మామ్ హనీలెట్ అక్కడ ఉన్నందున అక్కడ ఎటువంటి దుర్మార్గం జరుగలేదు’ అని చెప్పారు.

గతంలో కూడా..

మహిళా సహాయకురాలితో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడి అసభ్య ప్రవర్తన

గతంలో కూడా రోడ్రిగో డ్యూటెర్టేపై పలు ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. 2018 లో డ్యూటెర్టే ఒక ఇంటి పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్వయంగా ఒప్పుకున్నారు. ఒక సమావేశంలో ప్రసంగిస్తూ.. నిద్రపోతున్నప్పుడు పనిమనిషి లోదుస్తుల్లో చేయి పెట్టిన తీరును గొప్ప పనిగా చిత్రీకరించుకుని నవ్వులపాలయ్యారు.

ఇదే సంవత్సరంలో దక్షిణ కొరియా పర్యటనలో ఒక విదేశీ ఫిలిపినా కార్మికురాలిని పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. మహిళా కమ్యూనిస్టు తిరుగుబాటుదారులను యోనిలో కాల్చాలని ఫిలిపినో సైనికులకు చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

2016 ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో.. 1989 లో దావావో మేయర్‌గా ఉన్నప్పుడు ఒక మహిళా ఆస్ట్రేలియా మిషనరీ హత్య, లైంగికదాడి గురించి మాట్లాడుతూ.. ‘ఆమెపై లైంగికదాడి జరిగినందున నేను కోపంగా ఉన్నాను.. కానీ ఆమె చాలా అందంగా ఉంది. మేయర్ మొదట ఉండాలి’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడి ఆ తరువాత క్షమాపణ చెప్పవలసి వచ్చింది.

ఇవి కూడా చదవండి..

ధర్నాలో కూర్చున్న వారిపైకి దూసుకొచ్చిన కారు.. ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు

బ్రెజిల్‌లో వ్యాక్సిన్‌ కొరత.. విదేశాంగ మంత్రి రాజీనామా?

బొగ్గు అక్రమ రవాణా కేసులో సీబీఐ ఎదుట హాజరైన కింగ్‌పిన్‌ లాలా

బంగ్లాదేశ్‌లో మోదీ పర్యటన.. షేక్‌ హసీనా మెడపై కత్తి

రాజస్థాన్‌ ఆవిర్భావ దినం.. చరిత్రలో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
మహిళా సహాయకురాలితో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడి అసభ్య ప్రవర్తన
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement